గెజిట్‌పై పూర్తిగా అధ్యయనం చేశాకనే స్పందిస్తా: చంద్రబాబు

17-07-2021 Sat 13:11
  • బచావత్‌ ట్రైబ్యునల్‌కు, గెజిట్‌కు ఉన్న వ్యత్యాసాలను గుర్తించాల్సి ఉంది
  • వైసీపీ ప్రభుత్వం త‌ప్పించుకునే ప్రయత్నం చేస్తోంది
  • ఏపీ పట్ల సీఎం జగన్‌ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు
  • ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉంటాం
chandrababu slams jagan

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం ఏర్ప‌డిన నేప‌థ్యంలో కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డుల పరిధులను ఖరారుచేస్తూ మొన్న‌ అర్ధరాత్రి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్‌ను విడుదల చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ, ఆ గెజిట్‌పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తానని అన్నారు.

విజయవాడలోని రమేశ్‌ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుని చంద్రబాబు పరామర్శించి అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. బచావత్‌ ట్రైబ్యునల్‌కు, గెజిట్‌కు ఉన్న వ్యత్యాసాలను గుర్తించాల్సి ఉంద‌ని ఆయ‌న అన్నారు. అయితే, ఈ విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌కుండా వైసీపీ ప్రభుత్వం త‌ప్పించుకునే ప్రయత్నం చేస్తోందని వివ‌మ‌ర్శించారు. ఏపీ పట్ల సీఎం జగన్‌ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని, తాము మాత్రం ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉంటామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.