మోదీతో శరద్ పవార్ కీలక భేటీ.. 50 నిమిషాలు కొనసాగిన సమావేశం

17-07-2021 Sat 12:48
  • మోదీ నివాసంలో కొనసాగిన సమావేశం
  • రాష్ట్రపతి రేసులో పవార్ ఉన్నారనే వార్తలు
  • రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న భేటీ
Modi and Sharad Pawar Meets For Nearly 50 Minutes

దేశ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని మోదీ నివాసానికి శరద్ పవార్ వెళ్లారు. వీరిద్దరి సమావేశం దాదాపు 50 నిమిషాల సేపు కొనసాగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

భారత రాష్ట్రపతి రేసులో శరద్ పవార్ ఉండబోతున్నారని... ఆయనకు దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమైన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రపతి పదవికి తాను పోటీ చేయబోనని పవార్ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో మోదీతో పవార్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ఎన్సీపీ అధికారాన్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంపై ఈ భేటీ ఏ మేరకు ప్రభావాన్ని చూపబోతోందనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది.