'ఉస్తాద్'లో రామ్ డ్యూయెల్ రోల్?

17-07-2021 Sat 12:18
  • 'ఉస్తాద్'గా రానున్న రామ్
  • పుష్కలంగా మాస్ అంశాలు
  • కథానాయికగా కృతి శెట్టి
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్  
Ram latest movie with director Lingusamy movie

రామ్ హీరోగా దర్శకుడు లింగుసామి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'ఉస్తాద్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ కనిపించనున్నాడు. ఈ పాత్రలో మాస్ యాంగిల్ ఎక్కువగా ఉంటుందట. ఎంతటి ప్రమాదాన్నైనా చాలా ఈజీగా తీసుకుంటూ ఎదురెళ్లే పాత్రలో రామ్ యాక్షన్ ఒక రేంజ్ లో ఉండనుందనే టాక్ వినిపించింది. సమస్య ఎంతటి పెద్దదైనా ఆయన చాలా సింపుల్ గా తీసుకుంటూ దూకుడుగా వెళ్లే తీరు మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించేలా ఉంటుందని అంటున్నారు.

ఇక ఇప్పుడు ఈ సినిమాలో రామ్ 'డాక్టర్'గా కూడా కనిపించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. డాక్టర్ గా ఆయన తెరపై కనిపించడం ఖాయమేననీ, అయితే నాటకీయంగా ఆయన ఆ పాత్రలో కాసేపు కనిస్తాడా? లేదంటే నిజంగానే మరో పాత్ర ఉందా? అనే విషయంలో స్పష్టత రావలసి ఉందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం ఆది పినిశెట్టిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'సరైనోడు' తరహాలోనే ఆయన విలనిజం చాలా పవర్ఫుల్ గా ఉండనుందని అంటున్నారు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, 'సంక్రాంతి' రోజుల్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.