Karnataka: ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో యడియూర‌ప్ప భేటీ.. రాజీనామాపై స్పంద‌న‌

We discussed in detail the development of the party in Karnataka says karnataka cm
  • రాజీనామా చేస్తున్న‌ట్లు వస్తోన్న‌ ఊహాగానాల‌ను ఖండించిన‌ యడియూర‌ప్ప
  • జేపీ న‌డ్డాతో తాను క‌ర్ణాట‌క‌లో బీజేపీ అభివృద్ధిపై చ‌ర్చించాన‌ని వ్యాఖ్య‌
  • త‌న ప‌ట్ల జేపీ న‌డ్డాకు మంచి అభిప్రాయం ఉంద‌న్న సీఎం
  • వ‌చ్చేనెల మ‌రోసారి ఢిల్లీకి వ‌స్తాన‌ని స్ప‌ష్టం
కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వం మార్పు జ‌రుగుతోంద‌ని వార్త‌లు వ‌స్తోన్న వేళ ఆ రాష్ట్ర సీఎం బీఎస్‌ యడియూరప్ప ఢిల్లీకి వెళ్లి త‌మ పార్టీ అధిష్ఠానంతో చ‌ర్చ‌లు జ‌రిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాతో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపారు. అనంతరం కర్ణాటకలో సీఎం మార్పు గురించి ఆయనను మీడియా ప్రశ్నించింది. దీంతో త‌న రాజీనామాపై వ‌స్తోన్న‌ ఊహాగానాల‌ను ఆయ‌న‌ ఖండించారు.

తాను జేపీ న‌డ్డాతో క‌ర్ణాట‌క‌లో బీజేపీ అభివృద్ధిపై చ‌ర్చించాన‌ని యడియూర‌ప్ప చెప్పుకొచ్చారు. త‌న ప‌ట్ల ఆయ‌న‌కు మంచి అభిప్రాయం ఉంద‌ని, క‌ర్ణాట‌క‌లో బీజేపీని మ‌ళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాన‌ని చెప్పారు. క‌ర్ణాట‌క‌లో సాగునీటి ప్రాజెక్టుల విష‌యంపై చ‌ర్చించేందుకు ఢిల్లీకి వ‌చ్చాన‌ని, వ‌చ్చేనెల మ‌రోసారి ఢిల్లీకి వ‌స్తాన‌ని అన్నారు. మేకెదాటు ప్రాజెక్టుపై ప‌లువురు కేంద్ర‌ మంత్రుల‌ను క‌లిశాన‌ని, ఆ ప్రాజెక్టును సాధించి తీరుతామ‌ని తేల్చిచెప్పారు.
Karnataka
Yediyurappa
BJP

More Telugu News