ప్రియురాలిని పెళ్లాడిన టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే

17-07-2021 Sat 12:00
  • ముంబై మోడల్ అజుమ్ ఖాన్ ను పెళ్లాడిన దూబే
  • హిందూ, ముస్లిం సంప్రదాయాల ప్రకారం వివాహం
  • ఇండియా తరపున 13 టీ20లు ఆడిన దూబే
Cricketer Sivam Dubey married his girl friend

టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే ఒక ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన యువతిని పెళ్లాడాడు. ముంబై మోడల్ అజుమ్ ఖాన్, శివమ్ దూబే చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. చివరకు ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో అతి కొద్ది మంది మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. తమ పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా శివమ్ దూబే తెలియజేశాడు. తాము ప్రేమకంటే ఎక్కువగా ప్రేమించుకున్నామని తెలిపాడు. తమ ప్రయాణం ఇలా మొదలయిందని... జస్ట్ మ్యారీడ్ అని పెళ్లి ఫోటోలను షేర్ చేశాడు.

అజుమ్ ఖాన్ ముస్లిం, శివమ్ దూబే హిందువు కావడంతో వీరి పెళ్లిని రెండు మత సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. దూబే వయసు 28 ఏళ్లు. టీమిండియా తరపున 13 టీ20 మ్యాచులు ఆడాడు. 105 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టాడు. ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.