చివరిదశకు చేరుకున్న 'మేజర్'

17-07-2021 Sat 11:01
  • బయోపిక్ గా 'మేజర్'
  • నిర్మాణ భాగస్వామిగా మహేశ్
  • సయీ మంజ్రేకర్ పరిచయం
  • పరిస్థితులు అనుకూలించాక విడుదల  
Major movie update
అడివి శేష్ కథానాయకుడిగా శశి కిరణ్ తిక్కా 'మేజర్' సినిమాను రూపొందిస్తున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా నుంచి వదిలిన ప్రచార చిత్రాలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తీయడానికి అనుమతి కోరినప్పుడు సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు అంగీకరించలేదట. ఆ పాత్ర గౌరవాన్ని కాపాడతానని అడివి శేష్ హామీ ఇచ్చాకే ఒప్పుకున్నారట.

ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ .. శోభిత ధూళిపాళ్ల కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ముఖ్యమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. రేవతి కనిపించనున్నారు. ఈ సినిమా నిర్మాతలలో మహేశ్ బాబు ఒకరుగా ఉండటం విశేషం. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన కరోనా పరంగా అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని అంటున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే బలమైన నమ్మకంతో అడివి శేష్ ఉన్నాడు.