'ఐస్ క్రీమ్ 3' కోసం రెడీ అవుతున్న వర్మ!

17-07-2021 Sat 10:26
  • వర్మ నుంచి 'ఐస్ క్రీమ్' కథలు
  • రొమాన్స్ ప్రధానంగా సాగిన సినిమాలు
  • మరో సినిమాకు సన్నాహాలు
  • త్వరలోనే పూర్తి వివరాలు
Ice cream 3 movie from Ramgopal Varma

రామ్ గోపాల్ వర్మ నుంచి ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన సినిమా రాలేదు. ఫస్టు లాక్ డౌన్ కి ముందు కూడా ఆయన నుంచి వచ్చిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. ఆయన ఆ సినిమాలకు ఏ రకంగా పబ్లిసిటీ తీసుకురావడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే జయాపజయాలకు అతీతమైన ఒక క్రేజ్ వర్మకు ఉంది. అందువలన ఆయన సినిమాల కోసం ఎదురుచూసేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వాళ్లలో ఉత్సాహాన్ని పెంచే వార్త ఒకటి ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. 'ఐస్ క్రీమ్' ఫ్రాంచైజీలో మూడవ సినిమా కోసం ఆయన రంగంలోకి దిగాడనేదే ఆ వార్త సారాంశం.

వర్మ దర్శకత్వంలో 2014లో వచ్చిన 'ఐస్ క్రీమ్' సినిమా, యూత్ ను ఓ మాదిరిగా ఆకట్టుకుంది. నవదీప్ - తేజస్వి - మృదుల ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆ తరువాత కొంత గ్యాప్ తోనే వర్మ 'ఐస్ క్రీమ్ 2'  సినిమాను రిలీజ్ చేశాడు. జేడీ చక్రవర్తి .. నవీన .. నందు .. గాయత్రి గుప్తా ప్రధానమైన పాత్రలలో కనిపించారు. ఈ సినిమా కూడా ఓ మాదిరిగానే ఉందని చెప్పుకున్నారు. ఈ రెండు సినిమాలను నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణతో కలిసి, వర్మ ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమాను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే నటీనటులు .. సాంకేతిక నిపుణుల పేర్లను వెల్లడిస్తారట.