రైలు ప్రయాణికులకు శుభవార్త.. విడతల వారీగా 82 రైళ్లు అందుబాటులోకి!

17-07-2021 Sat 08:09
  • అందుబాటులోకి రానున్న రైళ్లలో 66 ప్యాసింజర్ రైళ్లు
  • దగ్గరి ప్రాంతాలకు ప్రయాణించే వారికి అనుకూలం
  • గతంలో తిరిగిన మార్గాల్లోనే అందుబాటులోకి
82 trains will commence service from 19th onwards

రైలు ప్రయాణికులకు ఇది శుభవార్తే. కరోనా కారణంగా ఆగిపోయిన రైళ్ల సేవలు మళ్లీ మొదలవనున్నాయి. ఈ నెల 19 నుంచి విడతల వారీగా 82 రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. అయితే ఇందులో 66 ప్యాసింజర్ రైళ్లే కావడం గమనార్హం. మిగతావి ఎక్స్‌ప్రెస్ రైళ్లు. ఈ నెల 19 నుంచి కొన్ని, 20, 21 తేదీల్లో మరికొన్ని రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ రైళ్లన్నీ గతంలో తిరిగిన మార్గంలోనే కొత్త నంబర్లతో తిరుగుతాయని రైల్వే పేర్కొంది.

రైలు ప్రయాణంలో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమల్లో ఉంటాయని దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య స్పష్టం చేశారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాల్సిందేనని అన్నారు.

అందుబాటులోకి రానున్న రైళ్లలో కొన్ని..
* కాజీపేట-సిర్పూరు టౌన్
* వాడి-కాచిగూడ
* డోర్నకల్-కాజీపేట
* కాచిగూడ-మహబూబ్ నగర్
* కాచిగూడ- కరీంనగర్
* సికింద్రాబాద్-కళబురిగి
* కరీంనగర్-పెద్దపల్లి
* విజయవాడ-డోర్నకల్
* విజయవాడ-గూడూరు
* కాకినాడ పోర్ట్-విజయవాడ
* నర్సాపూర్-గుంటూరు
*  రాజమండ్రి-విజయవాడ
*  విజయవాడ-మచిలీపట్టణం
* రేణిగుంట-గుంతకల్
* వరంగల్-సికింద్రాబాద్
* గుంటూరు-విజయవాడ