టీఆర్ఎస్‌లోకి కౌశిక్‌రెడ్డి.. ముహూర్తం ఫిక్స్!

17-07-2021 Sat 07:46
  • ఈ నెల 21న కేసీఆర్ సమక్షంలో చేరిక
  • టీఆర్ఎస్ హుజూరాబాద్ టికెట్ తనకేనంటూ ఇటీవల కౌశిక్ ఆడియో 
  • పార్టీకి రాజీనామా చేస్తూ రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు
Former Telangana Congress leader Kaushik Reddy to join TRS on July 21

కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నెల 21న ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. నిజానికి ఆయన 16నే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరిగింది. అయితే, 21న తన అనుచరులతో కలిసి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్‌లో చేరుతారని తెలుస్తోంది.

తనకు టీఆర్ఎస్ టికెట్ ఖాయమంటూ ఆయన వ్యాఖ్యల ఆడియో లీకైన తర్వాత కలకలం రేగింది. అనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కౌశిక్.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్‌కు రూ. 50 కోట్లు ఇచ్చి అధ్యక్ష పదవి కొనుక్కున్నారని ఆరోపించి కలకలం రేపారు.