సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

17-07-2021 Sat 07:30
  • 'ఆహా' కోసం రెజీనా వెబ్ సీరీస్ 
  • బాలయ్య కథతో గోపీచంద్  
  • 'టక్ జగదీశ్'పై నిర్మాతల క్లారిటీ  
Regina signs for a web series

*  కథానాయిక రెజీనా కూడా ఓ వెబ్ సీరీస్ లో నటిస్తోంది. దీని పేరు 'అన్యాస్ ట్యుటోరియల్'. ఆహా ఓటీటీ కోసం రూపొందుతున్న ఈ సీరీస్ కి పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ వెబ్ సీరీస్ ను క్రిస్మస్ కి స్ట్రీమింగ్ చేస్తారు.
*  యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, బాలకృష్ణ చేయవలసిన కథతోనే ఇప్పుడీ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రకథను బాలకృష్ణకు చెప్పాడనీ, అయితే అది వర్కౌట్ కాలేదని, ఇప్పుడీ కథ గోపీచంద్ కు నచ్చడంతో ఈ ప్రాజక్ట్ పట్టాలెక్కుతోందని తెలుస్తోంది.
*  నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'టక్ జగదీశ్' చిత్రం రిలీజ్ విషయంపై నిర్మాతలు తాజాగా క్లారిటీ ఇచ్చారు. "ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, అందులో వాస్తవం లేదు. రిలీజ్ విషయంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. తీసుకున్న వెంటనే మేమే తెలియజేస్తాం'' అని పేర్కొన్నారు.