సీఎం జగన్ పోలవరం పర్యటన ఖరారు

16-07-2021 Fri 22:00
  • ఈ నెల 19న పోలవరానికి సీఎం జగన్
  • ప్రాజెక్టు పనుల పరిశీలన
  • అధికారులతో సమీక్ష సమావేశం
  • కొన్నిరోజుల కిందట సీఎం పోలవరం పర్యటన వాయిదా
CM Jagan Polavaram tour confirmed

ఏపీ సీఎం జగన్ ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించాలనుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది. తాజాగా ఆయన పోలవరం పర్యటన ఖరారైంది. ఈ నెల 19న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే...

  • సోమవారం ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో పయనం.
  • ఉదయం 11 గంటలకు పోలవరం చేరిక.
  • కాఫర్ డ్యామ్, ప్రాజెక్టు వివిధ భాగాల సందర్శన
  • ఆపై మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు అధికారులతో సమీక్ష
  • మధ్యాహ్నం 1.20 గంటలకు హెలికాప్టర్ లో తాడేపల్లికి తిరుగు పయనం.