హోంమంత్రిని అవమానించిన సజ్జల దళిత జాతికి క్షమాపణలు చెప్పాలి: వర్ల రామయ్య

16-07-2021 Fri 21:08
  • సజ్జలపై వర్ల రామయ్య ధ్వజం
  • రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడని వ్యాఖ్యలు
  • గుంటూరులో తానే శంకుస్థాపన చేశారని విమర్శ  
  • హోంమంత్రిని పక్కనబెట్టారని ఆరోపణ
Varla Ramaiah demands apology from Sajjala

ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రజల్లోకి రావడంలేదని, దీంతో సజ్జల అన్నీ తానై వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

దళిత వర్గానికి చెందిన హోంమంత్రిని పక్కనబెట్టి గుంటూరులో తానే శంకుస్థాపన చేశారని, తద్వారా దళిత మహిళను అవమానించారని వర్ల రామయ్య ఆరోపించారు. హోంమంత్రి పట్ల అవమానకరంగా ప్రవర్తించిన సజ్జల దళిత జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.