తెలంగాణలో కొత్తగా 715 కరోనా కేసులు

16-07-2021 Fri 19:37
  • గత 24 గంటల్లో 1,13,069 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 76 కొత్త కేసులు
  • రాష్ట్రంలో నలుగురి మృతి
  • ఇంకా 10,028 మందికి చికిత్స
Telangana Covid bulletin

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,13,069 కరోనా పరీక్షలు నిర్వహించగా, 715 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 76 కొత్త కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 68, నల్గొండ జిల్లాలో 54 కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 784 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి 3,751 మంది కరోనాతో మృతి చెందారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,35,320 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,21,541 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,028 మందికి చికిత్స జరుగుతోంది.