విజయవాడ ఏసీపీకి 4 వారాల జైలుశిక్ష విధించిన హైకోర్టు

16-07-2021 Fri 18:25
  • ఏసీపీ శ్రీనివాసరావుపై హైకోర్టు ఆగ్రహం
  • ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేయాలని గతంలో ఆదేశం
  • కోర్టు ఆదేశాలను పాటించని ఏసీపీ
  • ధిక్కరణగా భావిస్తున్నామన్న హైకోర్టు
High court imposed Vijhayawada ACP four week imprisonment

విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఎస్సీ, ఎస్టీ కేసులో చార్జిషీట్ వేయాలని ఏసీపీకి గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా, ఆయన ఆ ఆదేశాలు పాటించలేదు. దాంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరణకు పాల్పడ్డారని న్యాయస్దానం పేర్కొంది.

దీనిపై ఏసీపీ శ్రీనివాసరావుకు 4 వారాల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. అయితే, ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనతో శిక్ష అమలును వారం పాటు నిలుపుదల చేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.