ఏపీలో మరో 2,345 మందికి కరోనా పాజిటివ్

16-07-2021 Fri 18:14
  • గత 24 గంటల్లో 81,740 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరిలో 508 కేసులు
  • కర్నూలు జిల్లాలో 29 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో 16 మంది మృతి
Corona spreading continue in Andhra Pradesh

ఏపీలో గడచిన 24 గంటల్లో 81,740 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,345 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 508 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 332, ప్రకాశం జిల్లాలో 243, కృష్ణా జిల్లాలో 238, పశ్చిమ గోదావరి జిల్లాలో 229 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 29 కొత్త కేసులు గుర్తించారు.

అదే సమయంలో 3,001 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,34,450 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,96,499 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 24,854 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,097కి చేరింది.