షూటింగ్ మొదలెట్టేసిన 'అమరన్'

16-07-2021 Fri 18:14
  • ఆది సాయికుమార్ హీరోగా 'అమరన్'
  • హీరోయిన్ గా అవికా గోర్
  • కొత్త దర్శకుడి పరిచయం
  • హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్  
Amaran movie shooting started
ఆదిసాయికుమార్ వరుసగా ఓ మూడు ప్రాజెక్టులు లైన్లో పెట్టేశాడు. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో, ఒకదాని తరువాత ఒకటిగా పట్టాలెక్కుతున్నాయి. అలా తాజాగా 'అమరన్' కూడా సెట్స్ పైకి వెళ్లింది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో ఆదిసాయికుమార్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఆయన కాంబినేషన్ సీన్స్ ను పోలీస్ స్టేషన్ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ కి సంబంధించిన ఇతర సన్నివేశాలను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు.

ఎస్వీఆర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి బాలవీర్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కృష్ణచైతన్య బాణీలు కడుతున్నాడు. ఈ సినిమాలో 'అవిక గోర్' కథానాయికగా నటిస్తోంది. ఈ మధ్య అవికా స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. వరుసగా ఆమె ఓ అరడజను సినిమాలు చేస్తోంది. అందులో 'అమరన్' కూడా ఒకటి. ఆమె పాత్రకి కూడా ప్రాధాన్యత ఉంటుందనీ, కథ ప్రకారం గ్రాఫిక్స్ వర్క్ కూడా ఉంటుందని చెబుతున్నారు. సాయికుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తూ ఉండగా, ఆదిత్య ఓం .. కృష్ణుడు .. మనోజ్ నందం ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.