"ఓ నారప్ప"... వెంకటేశ్ కొత్త చిత్రం నుంచి హుషారైన గీతం విడుదల

16-07-2021 Fri 16:35
  • వెంకటేశ్, ప్రియమణి జంటగా నారప్ప
  • తమిళ చిత్రం అసురన్ కు రీమేక్
  • జులై 20న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్
  • దుమ్మురేపుతున్న ట్రైలర్
Romantic song out now from Venkatesh starred Narappa

తమిళ చిత్రం అసురన్ రీమేక్ గా తెరకెక్కుతున్న నారప్ప చిత్రం నుంచి ఓ హుషారైన గీతం నేడు విడుదలైంది. ఓ నారప్ప అనే గీతానికి మణిశర్మ బాణీలు అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఈ పాటను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ చిత్రంలో వెంకటేశ్, ప్రియమణి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. సురేశ్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జులై 20న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికపై విడుదల కానుంది. రెండ్రోజుల కిందట విడుదలై నారప్ప ట్రైలర్ కు విశేషమైన స్పందన వస్తోంది. వెంకటేశ్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.