దళిత మంత్రి సుచరితను సజ్జల అణగదొక్కుతున్నారు: మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్ కుమార్

16-07-2021 Fri 15:49
  • గుంటూరు జిల్లాలో ఏకైక మంత్రిగా సుచరిత ఉన్నారు
  • సుచరిత విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదు
  • పదవులు ఇచ్చి, అధికారాన్ని వారి చేతుల్లోనే ఉంచుకున్నారు
Sajjala suppressing Sucharitha says Mala Mahanadu

ఏపీ హోంమంత్రి, దళిత నాయకురాలు సుచరితను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అణచి వేస్తున్నారని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్ కుమార్ ఘాటు విమర్శలు చేశారు. గుంటూరు జిల్లాలో ఏకైక మంత్రిగా సుచరిత ఉన్నారని... అయినప్పటికీ ఆమె విషయంలో ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదని చెప్పారు. సర్పంచ్ గా కూడా గెలవని సజ్జల ఏ హోదాలో ప్రారంభోత్సవాలు చేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు పదవులు ఇచ్చినప్పటికీ... అధికారాన్ని మాత్రం వారి సామాజికవర్గం చేతిలోనే ఉంచుకున్నారని విమర్శించారు. జరుగుతున్న తప్పులను జగన్ సరిదిద్దుకోవాలని, లేకపోతే దళితుల తిరుగుబాటును చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.