బ్రహ్మంగారి మఠ పీఠాధిపతి నియామ‌కం నిబంధనలకు అనుగుణంగా జ‌ర‌గ‌లేదు: ఏపీ హైకోర్టు

16-07-2021 Fri 14:57
  • కడప జిల్లా బ్రహ్మంగారి మఠం తాత్కాలిక పీఠాధిపతిగా ప్రత్యేకాధికారి
  • ఇటీవ‌లే నియమిస్తూ ధార్మిక పరిషత్‌ చేసిన తీర్మానం
  • దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్ష్మి హైకోర్టులో పిటిషన్‌
  • నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలంటూ మధ్యంతర ఉత్తర్వులు
high cout orders on brahmam math

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం తాత్కాలిక పీఠాధిపతిగా ప్రత్యేకాధికారిని నియమిస్తూ ధార్మిక పరిషత్‌ చేసిన తీర్మానం నిబంధనలకు అనుగుణంగా జ‌ర‌గ‌లేద‌ని ఏపీ హైకోర్టు పేర్కొంది. ఆ మఠం పీఠాధిపతి హోదా తమకే దక్కాలని దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్ష్మి హైకోర్టులో ఇటీవ‌ల‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

దీంతో పీఠాధిపతి ఎంపిక వ్యవహారంపై ఏపీ హైకోర్టులో ఈ రోజు కూడా విచార‌ణ జ‌రిగింది. ప్రత్యేకాధికారికి ఉత్తర్వులు ఇచ్చే అధికారం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ఈ సంద‌ర్భంగా న్యాయస్థానానికి చెప్పారు. అయితే, నిబంధనలకు అనుగుణంగానే జీవో జారీ చేశామని ప్రభుత్వం తెలిపింది. ఇరు ప‌క్షాల వాదనలు విన్న కోర్టు నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.