ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు చేదు అనుభ‌వం

16-07-2021 Fri 14:14
  • విజ‌య‌వాడ గ్రామీణం కుందావారికండ్రిగ‌లో గ్రామ‌స‌భ‌
  • అక్క‌డ‌కు వెళ్లిన మ‌ల్లాది విష్ణు
  • ధాన్యం డ‌బ్బులు ఇంకెప్పుడు ఇస్తార‌ని నిల‌దీత
 malladi vishnu faces bitter experiene

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు చేదు అనుభ‌వం ఎదురైంది. విజ‌య‌వాడ గ్రామీణం కుందావారికండ్రిగ‌లో నిర్వ‌హిస్తోన్న గ్రామ‌స‌భ‌కు వెళ్లిన మ‌ల్లాది విష్ణును స్థానిక‌ రైతులు నిల‌దీశారు. ధాన్యం అప్ప‌జెప్పినప్ప‌టికీ, వాటికి రావాల్సిన డ‌బ్బుల‌ను ప్ర‌భుత్వం చెల్లించ‌డం లేద‌ని అన్నారు. డ‌బ్బుల విడుద‌ల‌లో జాప్యం జ‌రుగుతుండ‌డంతో తాము ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని చెప్పారు. దీనిపై స‌మాధానం చెప్పాల్సిందేన‌ని నిల‌దీశారు. దీంతో స్పందించిన మ‌ల్లాది విష్ణు నెల రోజుల్లో డ‌బ్బులు వ‌స్తాయ‌ని హామీ ఇచ్చారు.