కేసీఆర్, జ‌గ‌న్, షర్మిల, బీజేపీ ఎవరి డ్రామా వారు ఆడుతున్నారు: జ‌గ్గారెడ్డి

16-07-2021 Fri 14:00
  • నీటి గొడవ పెద్ద నాట‌కం
  • ఇంధ‌న ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి
  • ఛ‌లో రాజ్‌భవన్ ను నిర్వహించి తీరుతాం
jagga reddy slams kcr jagan

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నీటి గొడ‌వ‌లు, దేశంలో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతుండ‌డం ప‌ట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  మండిప‌డ్డారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్,  ఏపీ సీఎం జగన్ ల నీటి గొడవ పెద్ద నాట‌క‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. జగన్, కేసీఆర్, మ‌రోవైపు షర్మిల, విజయమ్మ, బీజేపీ నేత‌లు అంద‌రూ ఎవరి డ్రామా వారు ఆడుతున్నారని ఆయ‌న ఎద్దేవా చేశారు.  

ఇంధ‌న ధ‌ర‌లు పెరిగిపోతుండ‌డాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేర‌కు ఈ రోజు ఛ‌లో రాజ్‌భవన్ ను నిర్వహించి తీరుతామని స్ప‌ష్టం చేశారు. పోలీసులు అనుమతిస్తే ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ శాంతియుతంగా ఉంటుంద‌ని, ఒక‌వేళ వారు త‌మ ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తే వారికి త‌గ్గట్లే తాము స్పందిస్తామ‌ని హెచ్చ‌రించారు.