పూజ హెగ్డే చేతులమీదుగా 'డియర్ మేఘ' సాంగ్ రిలీజ్!

16-07-2021 Fri 11:28
  • మేఘ ఆకాశ్ చుట్టూ తిరిగే కథ
  • అందంగా అల్లుకున్న ప్రేమకథ
  • సంగీత దర్శకుడిగా గౌర హరి
  • దర్శకుడిగా సుశాంత్ రెడ్డి పరిచయం  
Dear Megha movie song release

'డియర్ మేఘ' టైటిల్ తో మరో అందమైన ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. అదిత్ అరుణ్ .. మేఘ ఆకాశ్ జంటగా నటించిన ఈ సినిమాకి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అర్జున్ దాస్యం నిర్మించిన ఈ సినిమాకి, గౌర హరి సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియో వచ్చింది. పూజ హెగ్డే చేతుల మీదుగా ఈ సాంగ్ ను రిలీజ్ చేయించారు. 'ఆమని ఉంటే పక్కన .. ఏమని చెప్పను భావన' అంటూ ఈ పాట సాగుతోంది. 'ప్రతి అడుగు .. ప్రతి మలుపు నీతోనే .. మనసు మైదానంలో నీ కోసం గుడి కడుతున్నాను' వంటి పంక్తులు ప్రేమలోని గాఢతకు అద్దం పడుతున్నాయి. 'బయటికి భయపడి వినపడవా .. మనసున జరిగే మౌనరణమిదే' వంటి ప్రయోగాలు బాగున్నాయి. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపన ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రేమ ప్రధానంగా సాగే పాటలకు ఫీల్ ప్రాణం .. ఆ ఫీల్ ఈ పాట విజువల్స్ లోను కనిపించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోనైనా మేఘ ఆకాశ్ కి బ్రేక్ వస్తుందేమో చూడాలి.