'మాస్ట్రో' నుంచి బ్యూటిఫుల్ సాంగ్!

16-07-2021 Fri 10:57
  • నితిన్ తాజా చిత్రంగా 'మాస్ట్రో'
  • విభిన్నమైన కథాకథనాలు
  • ఆసక్తిని రేకెత్తించే అంశాలు
  • దర్శకుడిగా మేర్లపాక గాంధీ
Baby O Baby lyrical video from Maestro

నితిన్ ఈ ఏడాది కూడా తన దూకుడును కొనసాగిస్తున్నాడు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేస్తూ, ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా థియేటర్లలో దింపేస్తున్నాడు. అలా ఆయన తాజా చిత్రమైన 'మాస్ట్రో' కూడా విడుదల దిశగా అడుగులు వేసే ఆలోచన చేస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, నితిన్ సరసన నాయికగా నభా నటేశ్ అలరించనుంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి, తాజాగా ఓ లిరికల్ వీడియోను వదిలారు. 'బేబీ ఓ బేబీ' అంటూ ఈ పాట సాగుతోంది.

మనసు దోచేసిన అమ్మాయి తన హృదయంలో చేసే అందమైన అల్లరి .. సందడి గురించి ఓ ప్రేమికుడు పాడుకునే పాట ఇది. తన మనసు ఆమె కోసం ఎంతగా తపిస్తుందనేది ఆమెకి అర్థమయ్యేలా వినిపించే ప్రయత్నంలో భాగంగా ఈ పాట తెరపైకి రానుందని అనిపిస్తుంది. శ్రీ జో అందించిన సాహిత్యం ... అనురాగ్ కులకర్ణి ఆలాపన యూత్ కి నచ్చేలా ఉన్నాయి. బాణీ కొత్తగా .. వినసొంపుగా ఉంది. బహుశా ఈ సినిమాలోని ఆకర్షణీయమైన పాటల్లో ఇది ఒకటి కావొచ్చునేమో. ఈ ఏడాది నితిన్ నుంచి వచ్చిన 'రంగ్ దే' .. 'చెక్' నిరాశపరిచాయి. మరి 'మాస్ట్రో' ఏం చేస్తాడో చూడాలి.