జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ మార్పు
- నాలుగో విడత పరీక్షల షెడ్యూల్ మార్పు
- సెప్టెంబర్ 1, 2 తేదీల్లో పరీక్షలు
- విద్యార్థుల డిమాండ్ మేరకు మార్పు చేశామన్న ధర్మేంద్ర ప్రధాన్
అంతేకాదు, నాలుగో విడత పరీక్షల దరఖాస్తుల గడువును కూడా ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు. నాలుగో విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ఇప్పటికే 7.32 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకునే ఈ మార్పులు చేశామని చెప్పారు. జేఈఈ మెయిన్స్ మూడు, నాలుగో విడత పరీక్షలకు మధ్య నాలుగు వారాల వ్యవధి ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీకి సూచించామని తెలిపారు.