Hyderabad: హైదరాబాద్‌లో మరో ఐటీ హబ్.. పది లక్షల మందికి ఉద్యోగాలు

  • రింగ్ రోడ్డుకు సమీపంలో ఇదుళ్లనాగులపల్లి, కొల్లూరు ప్రాంతాల్లో ఐటీ హబ్
  • 650 ఎకరాల భూమిని గుర్తించిన హెచ్ఎండీఏ
  • 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా
One more IT hub coming to Hyderabad

హైదరాబాద్ నగరానికి నలువైపులా ఐటీ హబ్ లు విస్తరిస్తున్నాయి. తాజాగా మరో ఐటీ హబ్ కు రంగం సిద్ధమవుతోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఇదుళ్లనాగులపల్లి, కొల్లూరు ప్రాంతాల్లో ఐటీ హబ్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఔటర్ రింగ్ రోడ్డుకు 1.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న 640 ఎకరాల భూమిని ఈ ఐటీ హబ్ కోసం హెచ్ఎండీఏ గుర్తించింది. హైటెక్ సిటీ తరహాలోనే ఇక్కడ హబ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ హబ్ కోసం భూసేకరణ చేస్తారు. సమీకరించే భూముల యజమానులకు ఎకరాకు 600 గజాల చెప్పున అభివృద్ది చేసిన ప్లాట్లను కేటాయించనున్నారు. ఈ హబ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

More Telugu News