G Jagadish Reddy: నీటి వాటాలపై సుప్రీంకోర్టును ముందు మేమే ఆశ్రయించాం: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి

  • ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు
  • ఇటీవల సుప్రీంను ఆశ్రయించిన ఏపీ
  • స్పందించిన తెలంగాణ మంత్రి జగదీశ్
  • గతంలో ఏపీ సర్కారు కోర్టును ఉల్లంఘించిందని వెల్లడి
Telangana minister Jagadish Reddy comments on water disputes with AP

ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల అంశం సుప్రీంకోర్టు ముంగిట నిలిచిన సంగతి తెలిసిందే. కృష్ణా జలాల వాడకం అంశంలో తలెత్తిన సమస్యలపై ఏపీ ప్రభుత్వం కొన్నిరోజుల కిందటే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి దీనిపై స్పందిస్తూ... ఉభయ రాష్ట్రాల నీటి వాటాల విషయంలో సుప్రీంకోర్టును మొదట ఆశ్రయించింది తామేనని అన్నారు. ఏపీ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి, ఇప్పుడు మళ్లీ కోర్టును ఆశ్రయిస్తోందని తెలిపారు.

శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటిని ఉమ్మడిపాలనలో ఇష్టారీతిని వాడుకుని, తెలంగాణ ప్రజలను వలసపోయేలా చేశారని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో కేంద్ర బలగాలను కోరడం ఏపీ ప్రభుత్వ చేతగానితనం అని వ్యాఖ్యానించారు. స్నేహ హస్తాన్ని అందుకోలేక జగన్ ఆకతాయి పిల్లాడిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. 

More Telugu News