జూనియర్ ఎన్టీఆర్ టీవీ షో తొలి ఎపిసోడ్ కు గెస్టుగా రామ్ చరణ్!

15-07-2021 Thu 16:21
  • 'ఆర్ఆర్ఆర్' లో నటిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్
  • 'ఎవరు మీలో కోటీశ్వరులు' టీవీ షోకి హోస్ట్ గా ఎన్టీఆర్
  • చరణ్ తో ఓపెనింగ్ ఎపిసోడ్ పై సర్వత్రా ఆసక్తి
  • త్వరలో జెమిని టీవీలో ప్రసారం
Ram Charan guest for NTR TV show opening episode

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను అభిమానులు త్వరలో ఓ బుల్లితెర కార్యక్రమంలోనూ చూడనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు అనే టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం జెమిని టీవీ చానల్లో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ప్రారంభ ఎపిసోడ్ కు గెస్టుగా రామ్ చరణ్ వస్తున్నాడు. టీవీ కార్యక్రమాలు నిర్వహించడం జూనియర్ కు కొత్త కాదు. అయితే, ఈసారి తన మిత్రుడు రామ్ చరణ్ వస్తుండడంతో ఆ ఎపిసోడ్ ను ఎలా పండిస్తాడన్నది ఆసక్తి కలిగిస్తోంది.