PM Modi: వారణాసిలో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోదీ

  • జపాన్ సాయంతో రుద్రాక్ష్ సెంటర్ నిర్మాణం
  • సదస్సులు, సమావేశాలకు ఉపయోగపడే భారీ భవనం
  • ఇది ఆకర్షణీయ గమ్యస్థానం అని పేర్కొన్న మోదీ
  • వారణాసిలో నేడు ప్రధాని పర్యటన
PM Modi inaugurates Rudraksh Convention Centre in Varanasi

ప్రధాని నరేంద్ర మోదీ తన వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో నేడు పర్యటించారు. ఈ సందర్భంగా భారీస్థాయిలో నిర్మితమైన రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, వారణాసిలో రుద్రాక్ష్ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషదాయకమని అన్నారు.

జపాన్ సాయంతో, ఉన్నత కళానైపుణ్యంతో ఈ కేంద్రాన్ని నిర్మించినట్టు వెల్లడించారు. వారణాసిలోని ఈ రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ సదస్సులు, సమావేశాలు నిర్వహించుకునేందుకు పర్యాటకులను, వ్యాపారవేత్తలను ఆకర్షిస్తుందని తెలిపారు. భారత్, జపాన్ స్నేహ బంధానికి ఈ కన్వెన్షన్ సెంటర్ ఓ నిదర్శనం అని పేర్కొన్నారు.

2015లో భారత్ లో పర్యటించిన అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే ఈ భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఉదారంగా ఆర్థికసాయం ప్రకటించారు. ఇది భారతదేశ ఆధ్మాత్మిక నగరం వారణాసికి తాము ఇస్తున్న కానుక అని నాడు ప్రకటించారు.

More Telugu News