స్వాతంత్ర్యానికి ముందు గీసిన చిత్రానికి వేలంలో రూ.37.8 కోట్లు

15-07-2021 Thu 15:06
  • వేలం నిర్వహించిన శాఫ్రాన్ ఆర్ట్
  • 1938లో చిత్రాన్ని గీసిన అమృతా షేర్ గిల్
  • తన ఎస్టేట్ లో ఉండగా చిత్రించిన వైనం
  • వేలంలో అదిరిపోయే ధర
Huge price for Amrita Sher Gil painting

శాఫ్రాన్ ఆర్ట్ సంస్థ ఇటీవల రెండు అపురూప చిత్ర కళాఖండాలను వేలం వేసింది. ఆ రెండు చిత్రాల్లో ఒకటి ప్రముఖ చిత్రకారిణి అమృతా షేర్ గిల్ గీసింది కాగా, మరొకటి వీఎస్ గైటోండే అనే కళాకారుడికి చెందిన చిత్రం. గైటోండే గీసిన చిత్రానికి అత్యధికంగా వేలంలో రూ.39.98 కోట్ల ధర పలకగా, దివంగత చిత్రకారిణి అమృతా షేర్ గిల్ చిత్రం 'ఇన్ ద లేడీస్ ఎన్ క్లోజర్' రూ.37.8 కోట్లు కొల్లగొట్టింది.

అమృత ఈ చిత్రాన్ని దేశానికి స్వాతంత్ర్యం రాకముందు 1938లో గీశారు. ఈ చిత్రంలో కొందరు మహిళలు రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉండడాన్ని చూడొచ్చు. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఆమె గోరఖ్ పూర్ లోని తమ ఎస్టేట్ లో ఉంటూ ఈ అపురూప కళాఖండాన్ని చిత్రించారు.