ఉద్యోగ ఖాళీలు 56 వేలేనా?... లెక్క తీయాల్సిందే: రేవంత్ రెడ్డి

15-07-2021 Thu 14:26
  • ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కారు సిద్ధం
  • మోసానికి మాస్టర్ ప్లాన్ వేసిందన్న రేవంత్
  • 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉండాలని వెల్లడి
  • బిస్వాల్ రిపోర్టు చెబుతోందని వివరణ
  • ప్రభుత్వానివి దొంగలెక్కలని ఆరోపణ
Revanth Reddy questions Telangana govt on job vacancies

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం మోసానికి మాస్టర్ ప్లాన్ వేసిందని ఆరోపించారు. 2020 డిసెంబరులో బిస్వాల్ కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1.91లక్షలు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, కానీ ఉద్యోగ ఖాళీల సంఖ్య 56 వేలు దాటడంలేదని ప్రభుత్వం దొంగ లెక్కలు చూపిస్తోందని మండిపడ్డారు. వివిధ కార్పొరేషన్లలో ఉద్యోగ ఖాళీల సంఖ్య లెక్క తీయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్నింటిపైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.