'శాకుంతలం' సినిమాతో అల్లు అర్జున్ కుమార్తె వెండితెర ఎంట్రీ

15-07-2021 Thu 14:12
  • తెరంగేట్రం చేస్తున్న అల్లు అర్హ
  • 'శాకుంతలం' చిత్రలో చిన్ననాటి భరతుడి పాత్ర
  • అల్లు వారి కుటుంబం నుంచి సినిమాల్లోకి నాలుగో తరం
  • గర్వంగా ఉందన్న అల్లు అర్జున్ 
Allu Arha debuts with Sakuntalam movie

గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న 'శాకుంతలం' సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా నటిస్తోంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అల్లు వారి కుటుంబం నుంచి నాలుగో తరం సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండడం పట్ల గర్వంగా ఉందని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. 'శాకుంతలం' మూవీ ద్వారా అల్లు అర్హ సినిమా రంగంలో ప్రవేశిస్తోందని వివరించారు. ఇంతటి చక్కని సినిమా ద్వారా తన కుమార్తెను వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు దర్శకుడు గుణశేఖర్, నీలిమ గుణలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని బన్నీ చెప్పారు.

కాగా, 'శాకుంతలం' సినిమాలో అల్లు అర్హ చిన్ననాటి భరతుడిగా కనిపించనుంది. శకుంతల, దుష్యంతుల కుమారుడే భరతుడు. శకుంతల, దుష్యంతుడి ప్రేమకావ్యాన్ని గుణశేఖర్ 'శాకుంతలం' చిత్ర ఇతివృత్తంగా తీసుకున్నారు. ఇందులో సమంత ప్రధానపాత్ర పోషిస్తోంది . దుష్యంతుడిగా కేరళ యాక్టర్ దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.