ఓబీసీ రిజర్వేషన్లకు ఆదాయ పరిమితిని రూ.8 లక్షలకు పెంచిన ఏపీ ప్రభుత్వం

15-07-2021 Thu 13:55
  • ఓబీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో కీలక నిర్ణయం
  • మరింతమంది ఓబీసీలకు రిజర్వేషన్ ఫలాలు
  • ఇప్పటివరకు రూ.6 లక్షలుగా ఉన్న ఆదాయపరిమితి
  • ఇక రూ.8 లక్షల ఆదాయం లోపు వారికీ రిజర్వేషన్లు
AP Govt hikes OBC financial limitation

ఏపీ ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఓబీసీల ఆదాయ పరిమితిని రూ.8 లక్షలకు పెంచింది. ఇప్పటివరకు అది రూ.6 లక్షలుగా ఉండేది. ఇకపై రూ.8 లక్షల ఆదాయ పరిమితికి లోపు ఉన్నవారందరికీ ఓబీసీ రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. రూ.8 లక్షల ఆదాయం మించిన ఓబీసీలను క్రీమీ లేయర్ గా పరిగణిస్తారు. ఇప్పటి నుంచి ఓబీసీ సర్టిఫికెట్ల జారీలో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లను, బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ను ఆదేశించింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది.