Kareena Kapoor: కరీనా కపూర్‌ పై ఫిర్యాదు చేసిన క్రిస్టియన్ సంఘాలు

Christian unions files complaint on Kareena Kapoor
  • ఇబ్బందుల్లో బాలీవుడ్ నటి కరీనా కపూర్
  • 'కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పేరుతో పుస్తకం
  • తమ మనోభావాలను దెబ్బతీశారంటూ క్రిస్టియన్ సంఘాల ఆగ్రహం
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఇబ్బందుల్లో పడ్డారు. తమ మనోభావాలను కరీనా దెబ్బతీశారంటూ క్రిస్టియన్ సంఘాలు ఆమెపై శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాయి. వివరాల్లోకి వెళ్తే తన ప్రెగ్నీన్సీ అనుభవాలను ఆమె పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకానికి ఆమె 'కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పేరు పెట్టారు. ఈ టైటిల్ పై క్రిస్టియన్ సంఘాలు మండిపడ్డాయి. కరీనాతో పాటు బుక్ రాసిన మరో రచయిత అదితి షా భీమ్జానీ, బుక్ పబ్లిషర్ సంస్థ జాగ్గర్ నట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కరీనా కపూర్ పుస్తకానికి పెట్టిన టైటిల్ తమ పవిత్ర గ్రంథమైన బైబిల్ ని అవమానించేలా ఉందని క్రిస్టియన్ సంఘాలు తమ ఫిర్యాదులో పేర్కొన్నాయి. దీనిపై పోలీసులు స్పందిస్తూ, సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేయాలని అల్ఫా, ఒమేగా క్రిస్టియన్ మహాసంఘ్ అధ్యక్షుడు ఆశిష్ షిండే ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే తాము ఫిర్యాదు మాత్రమే తీసుకున్నామని, ఎఫ్ఐఆర్ ఇంకా నమోదు చేయలేదని చెప్పారు. ఈ కేసు ముంబై పరిధిలోకి వస్తుందని, తమ పరిధిలోకి రాదని ఆయనకు చెప్పామని అన్నారు.
Kareena Kapoor
Bollywood
Christians

More Telugu News