కోల్ కతాకు చేరుకున్న రజనీ.. ఈరోజు నుంచి 'అన్నయ్య' షూటింగ్

15-07-2021 Thu 11:19
  • ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన రజనీ
  • కోల్ కతాలో మొదలైన 'అన్నాత్తే' షూటింగ్
  • తెలుగు వెర్షన్ కు 'అన్నయ్య' టైటిల్ 
Rajinikanth reaches Kolkata

వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లొచ్చిన సినీ నటుడు రజనీకాంత్ మళ్లీ షూటింగులతో బీజీ అవుతున్నారు. తన తాజా చిత్రం 'అన్నాత్తే' షూటింగ్ ను ఆయన మళ్లీ ప్రారంభించారు. ఈ చిత్రానికి చెందిన గత షెడ్యూల్ హైదరాబాదులో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్ కోల్ కతాలో జరగనుంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుంది.

ఈ చివరి షెడ్యూల్ కోసం రజనీకాంత్ కోల్ కతా చేరుకున్నారు. ఈరోజు నుంచే షూటింగ్ ప్రారంభం కానుంది. షూటింగ్ నేపథ్యంలో చిత్రంలో నటిస్తున్న కీలక నటీనటులంతా కోల్ కతా చేరుకున్నారు. నవంబర్ 4న దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, ఈ చిత్రాన్ని తెలుగులో 'అన్నయ్య' టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు నయనతార, కీర్తి సురేశ్ నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నాడు.