'ఏజెంట్' సినిమాపైనే నాగ్ దృష్టి!

15-07-2021 Thu 10:30
  • కొత్త లుక్ తో అఖిల్
  • రీసెంట్ గా మొదలైన షూటింగ్
  • సంగీత దర్శకుడిగా తమన్
  • డిసెంబర్ 24వ తేదీన రిలీజ్
Ajent movie update

అఖిల్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా రూపొందుతోంది. సుంకర రామబ్రహ్మం .. సురేందర్ రెడ్డి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ఈ సినిమా నిర్మాణంలో నాగ్ భాగస్వామ్యం కూడా ఉందనే టాక్ తాజాగా వినిపిస్తోంది.

ఇక ప్రస్తుత పరిస్థితుల కారణంగా ... కథ ప్రకారం, ఈ సినిమా షూటింగు చాలావరకూ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. అయితే అక్కడ ఎన్ని రోజుల పాటు షూటింగు చేసినా, ఆ ఖర్చు అంతా కూడా నాగ్ ఖాతాలోకే వెళ్లనుందట. అంటే అనధికారికంగా నాగార్జున కూడా ఒక నిర్మాతగానే ఉన్నారని చెప్పుకుంటున్నారు.

మొదటి నుంచి కూడా అఖిల్ సినిమా కథాకథనాల విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వెళుతున్నారు. అయితే ఇంతవరకూ అఖిల్ స్థాయికి తగిన హిట్ పడలేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ పడాలనే ఉద్దేశంతో నాగార్జున ఉన్నారు. అందువల్లనే ఒక వైపున తన సినిమా షూటింగులను చక్కబెడుతూనే, మరో వైపున అఖిల్ 'ఏజెంట్' సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారట. ఈ సినిమా విషయాలను ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని అంటున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నారు.