Corona Virus: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు!

  • రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ
  • గత 24 గంటల్లో 41,806 మందికి సోకిన మహమ్మారి
  • 581 మంది కరోనాతో కన్నుమూత
  • మొత్తం కేసుల్లో సగం కేరళ, మహారాష్ట్ర నుంచే
41 thousand people infected to corona virus

దేశంలో తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం 31వేల దిగువకు పడిపోయిన కేసుల సంఖ్య తాజాగా మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో 41,806 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. అలాగే, 581 మంది కరోనాతో మరణించారు.  

తాజా కేసులతో కలుపుకుని దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3.09 కోట్లకు చేరుకోగా, 4,11,989 మంది మరణించారు. 39 వేల మంది  కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీలతో పోలిస్తే కేసులు ఎక్కువగా వెలుగుచూడడం అధికారులను కలవరపెడుతోంది.

ప్రస్తుతం దేశంలో రికవరీల రేటు 97.28 శాతంగా ఉండగా, యాక్టివ్ కేసుల రేటు 1.39 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ఇంకా 4,32,041 మంది కరోనాతో బాధపడుతున్నారు. 3.01 కోట్ల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. నిన్న 34.97 లక్షల మంది టీకా వేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో పంపిణీ అయిన డోసుల సంఖ్య 39 కోట్లు దాటింది.

ఇదిలావుంచితే, దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికి పైగా కేరళ, మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి.  

More Telugu News