Bandi Sanjay: ఈటల రాజేందర్ గెలుస్తారని సర్వే రిపోర్టులు వచ్చాయి: బండి సంజయ్

  • ఈటల బీజేపీలో చేరిన రోజే అమిత్ షాను కలుద్దామనుకున్నాం
  • హుజూరాబాద్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ భయపడుతోంది
  • టీఆర్ఎస్ కు అభ్యర్థి కూడా దొరకడం లేదు
Survey reports said that Etela Rajender will win says Bandi Sanjay

ఈ రోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. సమావేశానంతరం మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ.... ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన రోజే అమిత్ షాను కలుద్దామనుకున్నామని... అయితే ఆరోజు కుదరలేదని చెప్పారు. అందుకే సమయం తీసుకుని ఈరోజు ఢిల్లీకి వచ్చి కలిశామని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలవబోతున్నారని సర్వే రిపోర్టులు వచ్చాయని చెప్పారు.
 
తెలంగాణలో నిర్వహించబోయే బహిరంగసభకు వస్తానని అమిత్ షా చెప్పారని బండి సంజయ్ తెలిపారు. అదే విధంగా తాము చేపట్టబోతున్న పాదయాత్రకు కూడా ఆయనను ఆహ్వానించామని చెప్పారు. ఆగస్టు 9వ తేదీన తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు.

ఉపఎన్నిక గురించి టీఆర్ఎస్ భయపడుతోందని... వారికి అభ్యర్థి కూడా దొరకడం లేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా ఓటర్లు తీసుకోవాలని... ఎందుకంటే వాళ్లు పంచేది అవినీతి సొమ్మని చెప్పారు. తెలంగాణలో అవినీతి, అరాచక, అక్రమ పాలనను అంతం చేయడానికే పాదయాత్రను చేపడుతున్నామని అన్నారు.

More Telugu News