తెలంగాణ విద్యార్థినికి రూ.2 కోట్ల స్కాలర్షిప్ ఆఫర్ చేసిన అమెరికా విద్యాసంస్థ
- లాఫాయేట్ కాలేజీలో డిగ్రీ అడ్మిషన్ పొందిన శ్వేత
- డైయర్ ఫెలోషిప్ పేరిట లాఫాయేట్ కాలేజీ ఉపకారవేతనం
- ప్రతి ఏటా ఆరుగురికి అందజేత
- ఈ ఏడాది ఎంపికైన వారిలో శ్వేతారెడ్డికి స్థానం
తాను లాఫాయేట్ కాలేజీ స్కాలర్ షిప్ కు ఎంపిక కావడం పట్ల శ్వేతారెడ్డి ఆనందం వ్యక్తం చేస్తోంది. డెక్స్ టెరిటీ గ్లోబల్ అనే సంస్థలో పొందిన శిక్షణ తాను స్కాలర్ షిప్ పొందడానికి తోడ్పడిందని వెల్లడించింది. అటు లాఫాయేట్ కాలేజీ కూడా దీనిపై స్పందిస్తూ, శ్వేతారెడ్డి ప్రతిభ, నాయకత్వ లక్షణాలు తమను ఆకట్టుకున్నాయని తెలిపింది.