ఏపీలో కొత్తగా 2,591 కరోనా పాజిటివ్ కేసులు

14-07-2021 Wed 17:56
  • 24 గంటల్లో 15 మంది మృతి
  • తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 511 కేసులు
  • రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 25,957
AP registers 2591 new corona cases

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 2,591 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 511 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 29 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 3,329 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది కరోనా వల్ల మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
 
తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,29,579కి పెరగగా... ఇప్పటి వరకు 18,90,565 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,057 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,957 యాక్టివ్ కేసులు ఉన్నాయి.