జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిష‌న్‌పై సీబీఐ కోర్టులో విచార‌ణ‌.. మళ్లీ వాయిదా!

14-07-2021 Wed 13:35
  • లిఖిత పూర్వకంగా తమ వాదనలు సమర్పిస్తామన్న సీబీఐ
  • అందుకు 10 రోజుల గడువు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి
  • రఘురామ తరఫు న్యాయవాది అభ్యంత‌రాలు
  • త‌దుప‌రి విచారణ ఈ నెల 26కి వాయిదా  
trial in cbi court on raghurama petition

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై ఈ రోజు కూడా హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా, లిఖిత పూర్వకంగా తమ వాదనలు సమర్పిస్తామని సీబీఐ తెలిపింది. అలాగే అందుకు 10 రోజుల గడువు ఇవ్వాల‌ని కోర్టును కోరింది. అయితే, సీబీఐ తీరుపై రఘురామ తరఫు న్యాయవాది అభ్యంత‌రాలు తెలుపుతూ.. సీబీఐ తరచూ వైఖరి మారుస్తూ కాలయాపన చేస్తోందని అన్నారు. కోర్టు ఈ పిటిషన్‌పై త‌దుప‌రి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.