ఢిల్లీకి బండి సంజయ్, ఈటల... అమిత్ షాతో భేటీకానున్న నేతలు!

14-07-2021 Wed 12:23
  • మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షాతో భేటీ  
  • తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చ 
  • హుజూరాబాద్ ఉపఎన్నికకు సిద్ధమవుతున్న తీరును వివరించనున్న నేతలు
Bandi Sanjay and Etela Rajender to meet Amit Shah

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్తున్నారు. కాసేపట్లో హైదరాబాద్ నుంచి వారు ఢిల్లీకి పయనమవుతున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వీరు భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వీరి సమావేశం జరగనుంది.

ఈ భేటీ సందర్భంగా తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ స్థితిగతులపై చర్చించనున్నారు. దీంతో పాటు హుజూరాబాద్ ఉపఎన్నికకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్న తీరును అమిత్ షాకు వీరు వివరించనున్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటన గురించి బండి సంజయ్ మాట్లాడుతూ, అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్తున్నామని చెప్పారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.