Raviteja: అవినీతిపరుల అంతుచూసే 'రామారావు'

Ramarao On Duty movie update
  • ప్రభుత్వ అధికారి పాత్రలో రవితేజ
  • డిఫరెంట్ గా డిజైన్ చేసిన పాత్ర
  • దర్శకుడిగా శరత్ మండవ
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచన
రవితేజ తదుపరి సినిమాగా 'రామారావు ఆన్ డ్యూటీ' రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ వచ్చిన తరువాత అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రవితేజ ఈ సినిమాలో 'సబ్ కలెక్టర్' పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ప్రవర్తించనుందనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, రవితేజ ఈ సినిమాలో ప్రభుత్వ సంపదలను కొల్లగొట్టే అనినీతిపరుల ఆటకట్టిస్తాడట. అయితే అందుకోసం ఆయన ఎంచుకునే మార్గం కొత్తగా ఉంటుందని అంటున్నారు.

అంటే ఒక సిన్సియర్ ప్రభుత్వ అధికారి డ్యూటీ పరంగా తనకి ఎదురవుతున్న అవరోధాలను దాటడం కోసం ఏం చేశాడు? అవినీతిపరుల బారి నుంచి ప్రభుత్వ సంపదలను కాపాడటానికి ఏ రూట్లో వెళ్లాడు? అనేదే ఆసక్తికరంగా సాగుతుందని చెబుతున్నారు. ఈ ప్రయత్నంలో చోటుచేసుకునే మలుపులు ఉత్కంఠను రేకెత్తిస్తాయని అంటున్నారు. ఇక టైటిల్ మొదలు .. కథ అంతా కూడా రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగానే అనిపిస్తోంది. ఈ సినిమాను 'సంక్రాంతి' బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
Raviteja
Divyansha Koushik

More Telugu News