anandaiah: కొంద‌రు నా పేరిట‌ నకిలీ క‌రోనా మందు తయారు చేసి అమ్ముకుంటున్నారు: ఆనందయ్య

anandaiah on medicine distributions
  • ఆ నకిలీ మందు వికటిస్తే దానికి నేను బాధ్యుడిని కాను
  • న‌కిలీ మందుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
  • నా మందును ఉచితంగా పంపిణీ చేస్తున్నాం
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య త‌యారు చేస్తోన్న క‌రోనా మందు ఉచిత‌ పంపిణీ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. అయితే, కొందరు తన పేరిట‌ నకిలీ మందు తయారు చేసి అమ్ముకుంటున్నారని ఆనందయ్య చెప్పారు.

తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ... తన పేరిట కొంద‌రు తయారు చేస్తున్న నకిలీ మందు వికటిస్తే దానికి తాను బాధ్యుడిని కానని ఆయ‌న అన్నారు. న‌కిలీ మందుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయ‌న అన్నారు. తాను త‌యారు చేసిన క‌రోనా మందు అన్ని ప్రాంతాలకూ చేరింద‌ని ఆయ‌న చెప్పారు. దాని పంపిణీకి సహకరించిన వారికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని అన్నారు.
anandaiah
Corona Virus
Andhra Pradesh

More Telugu News