PM Modi: టోక్యో ఒలింపిక్స్ కు వెళుతున్న క్రీడాకారులతో మాట్లాడిన ప్రధాని మోదీ

PM Modi talks to Olympics bound Indian athletes
  • ఈ నెల 23 నుంచి టోక్యో ఒలింపిక్స్
  • భారత్ నుంచి పలువురు క్రీడాకారులు
  • వర్చువల్ విధానంలో మాట్లాడిన మోదీ
  • యువ అథ్లెట్లకు స్ఫూర్తి కలిగించే ప్రయత్నం
మరికొన్నిరోజుల్లో టోక్యో ఒలిపింక్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ తరఫున ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా మాట్లాడారు. ప్రముఖ బ్యాడ్మింటన్ తార పీవీ సింధుతోనూ, ఆమె తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. సింధును ప్రపంచ చాంపియన్ గా ఎలా మలిచారంటూ ఆమె తల్లిదండ్రులను అడిగారు.

ఆపై హైదరాబాద్ టెన్నిస్ భామ సానియా మీర్జాతో మాట్లాడి ఆమె కెరీర్ గురించి తెలుసుకున్నారు. తన పాతికేళ్ల టెన్నిస్ ప్రస్థానాన్ని సానియా ప్రధానికి వివరించింది. దేశంలో క్రీడలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని కొనియాడింది. స్టార్ బాక్సర్ మేరీ కోమ్, రెజ్లింగ్ క్రీడాకారిణి వినేశ్ ఫోగాట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా, చాంపియన్ ఆర్చర్ దీపికా కుమారి, స్విమ్మింగ్ సంచలనం సజన్ ప్రకాశ్ లతో ముచ్చటించారు. వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు.
PM Modi
Athletes
Tokyo Olympics
India

More Telugu News