Vinod: మావోయిస్టు అగ్రనేత వినోద్ మృతి

Maoist leader Vinod dies of illness
  • మావోయిస్టులకు మరో దెబ్బ
  • అనారోగ్యంతో వినోద్ కన్నుమూత
  • నిర్ధారించిన భద్రాద్రి ఎస్పీ
  • ఎమ్మెల్యే మాండవి హత్యకు సూత్రధారి వినోద్
మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వినోద్ మృతి చెందాడు. మావోయిస్టు అగ్రనేత వినోద్ మరణాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్ నిర్ధారించారు. వినోద్ కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని ఎస్పీ వెల్లడించారు. వినోద్ తలపై గతంలో చత్తీస్ గఢ్ ప్రభుత్వం రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వినోద్ తలపై రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది. ఎమ్మెల్యే భీమా మాండవి హత్య కుట్రకు వినోద్ సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు.

ఇటీవలే మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ కన్నుమూయడం తెలిసిందే. ఆయన భార్య సమ్మక్క అలియాస్ శారద కూడా అనారోగ్యంతో మరణించారు.
Vinod
Death
Maoist
Telangana
Police

More Telugu News