Nikhil: నిఖిల్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్!

 Intresting title for Nikhil movie
  • భారీ విజయాన్ని సాధించిన 'కార్తికేయ'
  • షూటింగు దశలో సీక్వెల్
  • వివిధ రాష్ట్రాల్లో జరిగిన షూటింగ్
  • విదేశాలకు వెళ్లేందుకు సన్నాహాలు
  • కీలక పాత్రలో అనుపమ్ ఖేర్  
ప్రస్తుతం నిఖిల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి '18 పేజెస్' అయితే, మరొకటి 'కార్తికేయ 2'. ఆల్రెడీ '18 పేజెస్' సినిమాను పూర్తి చేసిన నిఖిల్, ఇప్పుడు పూర్తి దృష్టి 'కార్తికేయ 2'పై పెట్టాడు. ఈ సినిమాను 'కార్తికేయ 2' అనే టైటిల్ తోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఈ సినిమాకి ఒక కొటేషన్ గా అనుకున్న 'దైవం మనుష్య రూపేణా' అనేది టైటిల్ గా పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్టు, దాదాపు ఇదే టైటిల్ గా ఖరారు కావొచ్చునని అంటున్నారు.

చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయంతో ముడిపడిన కథతో మొదటిభాగం సాగితే, ద్వాపరయుగానికి సంబంధించిన ఒక రహస్యంతో ముడిపడి రెండవభాగం నడుస్తుందని అంటున్నారు. గుజరాత్ .. ఉత్తరాఖండ్ .. హిమాచల్ ప్రదేశ్ .. రాజస్థాన్ లోని లొకేషన్స్ లో కొన్ని రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. తదుపరి షెడ్యూల్ ను యూరప్ దేశాలలో ప్లాన్ చేశారట. అందుకు అవసరమైన సన్నాహాలను చేసుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం.
Nikhil
Chandu Mondeti
Karthikeya 2

More Telugu News