అక్రమ విద్యుత్ కనెక్షన్ ను కత్తిరిస్తూ ఇలా దొరికిపోయాడు... వీడియో ఇదిగో!

13-07-2021 Tue 18:06
  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • అక్రమ కనెక్షన్ దారులపై అధికారుల కొరడా
  • తనిఖీలు చేపట్టిన వైనం
  • కెమెరాకు దొరికిపోయిన వ్యక్తి
UP Man tries to cut illegal power connection
చాలా చోట్ల అనుమతి లేకుండా, విద్యుత్ ను అక్రమంగా వాడేయడం తెలిసిందే. అధికారులు ఎంత నిఘా ఉంచినా, కొందరు అక్రమ కనెక్షన్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంటారు. ఇక అసలు విషయానికొస్తే.... ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం అక్రమ విద్యుత్ వాడకందార్ల పనిబట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది.

ఈ క్రమంలో ఇక్కడి మురాద్ నగర్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఆసక్తికర సంఘటన జరిగింది. అధికారులు వస్తున్నారని తెలిసి, ఓ వ్యక్తి తన ఇంటిపై ఉన్న అక్రమ కనెక్షన్ ను తొలగించేందుకు బల్లిలా పాక్కుంటూ కనెక్షన్ వద్దకు వచ్చాడు. అయితే ఇదంతా సెల్ ఫోన్ కెమెరాలో రికార్డు చేశారు. కెమెరాను చూసి అతగాడు గతుక్కుమన్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.