Pankaja Munde: నాకు మంత్రి పదవుల మీద మోజు లేదు: పంక‌జ ముండే

I dont have interest on minister post says Pankaja Munde
  • కేంద్ర మంత్రివర్గంలో పంకజ ముండేకు దక్కని స్థానం
  • రాజీనామాలకు సిద్ధమైన ఆమె అనుచరులు
  • తన కోసం ఎవరూ త్యాగం చేయాల్సిన అవసరం లేదన్న పంకజ
ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణంలో మహారాష్ట్రకు చెందిన పంకజ ముండేకు స్థానం లభించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీలోని పదవులకు రాజీనామా చేయడానికి ఆమె అనుచరులు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, తన కోసం ఎవరూ త్యాగం చేయాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. ఈ విషయంలో తాను యుద్ధం చేయాలని అనుకోవడం లేదని చెప్పారు. తమ సామాజికవర్గంలో ఒకరికి స్థానం దక్కిందని, తనకు అదే చాలని అన్నారు. తనకు కానీ, తన సోదరి ప్రీతమ్ ముండేకు కానీ మంత్రి పదవుల మీద మోజు లేదని చెప్పారు.

బీజేపీలో తాను జాతీయ స్థాయి నాయకురాలినని పంకజ ముండే తెలిపారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలే తనకు నాయకులని చెప్పారు. తన తండ్రి గోపీనాథ్ ముండే ఉన్నప్పుడు అట్టడుగు వర్గాల వారికి ఉన్నత పదవులు కట్టబెట్టేవారని తెలిపారు. మంత్రి పదవుల కోసం తనను, తన సోదరిని తన తండ్రి రాజకీయాల్లోకి తీసుకురాలేదని చెప్పారు. తన తండ్రి చనిపోయిన తర్వాత మహారాష్ట్ర బీజేపీ తనకు మంత్రి పదవిని ఆఫర్ చేసిందని... కానీ, ఆ ఆఫర్ ను తాను తిరస్కరించానని తెలిపారు.
Pankaja Munde
Maharashtra
BJP

More Telugu News