Sai Madhav: శంకర్ 'మెగా' ప్రాజక్టుకు సాయిమాధవ్ మాటలు!

Sai Madhav writes dialogues for Shankar and Charan movie
  • శంకర్, చరణ్ కలయికలో భారీ చిత్రం 
  • పాన్ ఇండియా మూవీగా నిర్మాణం
  • జోరుగా సాగుతున్న ప్రీ ప్రొడక్షన్ పనులు
ఇప్పుడు తెలుగులో మన స్టార్ హీరోలు నటిస్తున్నవన్నీ చాలావరకు పాన్ ఇండియా సినిమాలే. భారీ బడ్జెట్టుతో రూపొందుతున్న చిత్రాలే. ఇందులో తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి మరింత ప్రాధాన్యత వుంది. ఇది శంకర్ చేస్తున్న తొలి తెలుగు డైరెక్ట్  సినిమా కాగా, మెగా ఫ్యామిలీ స్టార్ హీరో రామ్ చరణ్ ఇందులో నటిస్తుండడం మరో విశేషం. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని నిర్మిస్తుండడం ఇంకో విశేషం.

ఈ కోవలో ఇప్పుడీ చిత్రానికి మరో విశేషం తోడైంది. తెలుగులో భారీ చిత్రాలకు పనిచేస్తూ, స్టార్ రైటర్ గా పేరుతెచ్చుకున్న సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు. దీనిపై సాయిమాధవ్ స్పందిస్తూ, 'జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓ ఫొటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను. ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను..' అంటూ ఆనందంతో శంకర్, చరణ్, దిల్ రాజులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు.

ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే షూటింగును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే కథానాయిక పేరును కూడా త్వరలో ప్రకటిస్తారు.
Sai Madhav
Ramcharan
Shankar
Dil Raju

More Telugu News