Dharmapuri Sanjay: బీజేపీ ఎంపీ అర్వింద్ సోదరుడు కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధం

Dharmapuri Sanjay set join Congress party soon
  • టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి
  • దూకుడు రాజకీయాలకు రేవంత్ ప్రాధాన్యం
  • రేవంత్ నాయకత్వంపై నేతల నమ్మకం
  • కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్న నేతలు
తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న వారిలో నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కూడా ఉన్నారు. సంజయ్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు. సంజయ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, భూపాలపల్లి బీజేపీ నేత గండ్ర సత్యనారాయణ కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు.

దీనిపై ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగానని, తండ్రి ధర్మపురి శ్రీనివాస్ కోసమే టీఆర్ఎస్ లో చేరానని, ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ లోకి వస్తున్నట్టు వెల్లడించారు. త్వరలో ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని వివరించారు.

అటు, మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఎర్ర శేఖర్ ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గండ్ర సత్యనారాయణ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు.

టీపీసీసీ అధ్యక్ష పదవిలోకి వచ్చాక రేవంత్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను ఆకర్షించడంలో సఫలమవుతున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. రేవంత్ కు టీపీసీసీ పగ్గాలు అప్పగించడంతో కాంగ్రెస్ పుంజుకోవడంపై అంచనాలు బలపడుతున్నాయి.
Dharmapuri Sanjay
Arvind
Congress
BJP
Revanth Reddy
TPCC President
Telangana

More Telugu News